తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ ( Tandur ) పోలీస్ స్టేషన్ పరిధిలోని రేచిని గ్రామానికి చెందిన రాచకొండ వెంకటేష్ (35) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ( Suicide ) పాల్పడినట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. మద్యానికి అలవాటు పడి భార్య, పిల్లల బాగోగులు చూసుకోక పోవడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్ మద్యంమత్తులో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. మృతదేహాన్ని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.