వాంకిడి, జులై 8 : కొమరం భీమ్ జిల్లా వాంకిడి మండలంలోని బనార్ కోసార గ్రామానికి చెందిన పవన్ (23) సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పవన్ రాత్రి అతిగా మద్యం సేవించి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు మందలించారు.
దీంతో మనస్తాపానికి గురైన పవన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి పవన్‌కు ఆసిఫాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల తర లించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.