మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 14 : రాష్ట్ర ప్రజలంతా మళ్లీ కేసీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నారని ఐసీడీఎస్ మాజీ రీజినల్ ఆర్గనైజర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు అత్తి సరోజ పేర్కొన్నారు.
ఈ నెల 17న కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మొక్క నాటాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని జన్మభూమినగర్లోగల వినాయక ఆలయం సమీపంలో మహిళలతో కలిసి మొక్కలు నాటారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. అన్ని వర్గాల కోసం అనేక పథకాలు అమలు చేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు.