నార్నూర్ : ఉమ్మడి మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి (MLA Kovalakshmi ) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్( Narnoor ), గాదిగూడ ( Gadiguda ) మండలాల్లో సోమవారం పర్యటించారు. నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ నమూనా గృహాలను ఆమె ప్రారంభించారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని మారుమూల మండలలైన నార్నూర్, గాదిగూడ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్థులను కోరారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్యత పాటించడం లేదని ఆదివాసి నాయకుడు అర్కా గోవింద్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే నాణ్యత పాటించేలా చూడాలని హౌసింగ్ ఏఈ శ్రీకాంత్‌కు సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జాడి రాజాలింగం,ఎంపీడీవో పుల్లారావ్, నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోయం మారుతి, మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్, మాజీ జడ్పీటీసీహేమలత బ్రిజ్జిలాల్, సహకార సంఘం డైరెక్టర్ దుర్గే కాంతారావ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జాదవ్ కైలాస్, నాయకులు మెస్రం హన్మంత్ రావ్, లోకండే దేవరావ్, సయ్యద్ ఖాసిం, ఉద్ధవ్ కాంబ్లే తదితరులు ఉన్నారు.