భైంసా, ఫిబ్రవరి 12 : భైంసా పట్టణంలోని నర్సింహానగర్కు చెందిన దీప (22) ఉరిసుకొని ఆత్మహత్య చేసుకున్నది. మనస్తాపంతో భర్త సాయి ట్రాన్స్ఫార్మర్ను పట్టుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకున్నది. తెలిసిన వివరాల ప్రకారం.. సాయి, దీపకు గతేడాది వివాహం జరిగింది. కొద్ది రోజులుగా మనస్పర్థల కారణంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం కూడా గొడవ జరగడంతో క్షణికావేశంలో దీప ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. మనస్తాపం చెందిన సాయి, కుభీర్ క్రాస్ రోడ్డులో గల ట్రాన్స్ఫ్మార్ను ముట్టకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలవగా, స్థానికులు ప్రైవేటు దవాఖాకు తరలించారు. ప్రస్తుతం సాయి పరిస్థితి విషమంగా ఉంది.