కాసిపేట : భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ( Jawaharlal Nehru) జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించే బాలల దినోత్సవం ( Childrens Day ) మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని చేపట్టగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి సహచరులకు పాఠాలు బోధించారు. విద్యార్థులు ప్రముఖుల వేషధారణలతో అలరించారు. ఆయా పాఠశాలల్లో నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.