కుభీర్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) హయాంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ తోఫా (Ramadan Gift ) దక్కేదని, ఇప్పుడు అది ఏమైందని బీఆర్ఎస్ ( BRS ) ముధోల్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కిరణ్ కొమ్రెవార్ అన్నారు.
సోమవారం మండల కేంద్రం కుబీర్‌లో పలువురు మైనారిటీ సోదరులను కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వారి ఇండ్లకు వెళ్లి తేనేటి విందును ఆరగించారు. మళ్లీ రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్, పార్టీ మైనార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అబ్రార్, వైస్ ఎంపీపీ మోహియోద్దీన్, దొంతుల దేవిదాస్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.