నార్నూర్ : అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డుల ( Ration Cards ) పంపిణీ చేస్మాని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ( MLA Kova Laxmi ) , ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ( Collector Rajarshi Sha) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం రాజుల్ గూడ ఫంక్షన్ భవనంలో రేషన్ కార్డులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ కార్డుల పంపిణీ నిరంతరం కొనసాగుతుందని అన్నారు. నీతి అయోగ్‌లో నార్నూర్ మండలం అభివృద్ధి శాఖ ముందుకెళ్లిందని సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కోవాలా లక్ష్మి గాదిగూడ మండలంలో రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అంతకుముందు నార్నూర్ మండలంలోని ఖైరదట్వా గ్రామంలో మోహ లడ్డు యంత్రాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రాథమిక పాఠశాలను సందర్శించి సౌకర్యాలు, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. నార్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభించారు.
భీంపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో సీవీ రామన్ సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అంగన్వాడీ టీచర్లకు ఆట పరికరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, అదనపు జిల్లా కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సోలోని చాబ్రా, సీఈవో జితేందర్ రెడ్డి, డీఆర్డీవో పీడీ రాథోడ్ రవీందర్, గ్రంథాలయ జిల్లా చైర్మన్ మల్లెపు నర్సయ్య, వ్యవసాయ జిల్లా అధికారి శ్రీధర్ స్వామి, ఎంపీడీవో రాథోడ్ గంగా సింగ్,ఐసీడీఎస్ పీడీ మిల్కా, తదితరులు పాల్గొన్నారు.