ఎదులాపురం,జనవరి10: బయోమైనింగ్ ప్రాజెక్టు ద్వారా వర్మీకంపోస్ట్ తయారు చేయనున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని బంగారు గూడ కాలనీ డంప్ యార్డ్‌లో రూ.10కోట్లతో బయోమైనింగ్ ప్రాజెక్టు పనులను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. డంప్ యార్డ్‌లో చేపడుతున్న వివిధ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 36 ఎకరాల పరిధిలోని ఈ డంప్ యార్డులో 1. 80 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉన్నాయని సర్వేలో తేలిందన్నారు. ఈ వ్యర్థాలను బయోమైనింగ్ ద్వారా వర్మీకంపోస్ట్ ఎరువులు తయారు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కమిషనర్ శైలజ, ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, కో ఆప్షన్ సభ్యుడు ఎజాజ్ , మల్లయ్య బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
బ్లాంకెట్ల పంపిణీ
జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో రోగుల సహాయకులు 200 మందికి మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ బ్లాంకెట్లు వితరణ చేయగా ఎమ్మెల్యే జోగు రామన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రిమ్స్‌కు వచ్చిన వారికి బ్లాంకెట్లు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్, కౌన్సిలర్ బండారి సతీశ్, స్వామి, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ ఉన్నారు.
డీఆర్సీసీ సెంటర్ సందర్శన
ఆదిలాబాద్ టౌన్, జనవరి 10 : పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్ (డీఆర్సీసీ)ను ఎమ్మెల్యే సందర్శించారు. సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రానికి పారిశుధ్య కార్మికులు తీసుకు వచ్చే చెత్తలో వివిధ వస్తువులను వేరుచేసి వారికి దానికి తగ్గట్టుగా పారితోషకం అందించడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కమిషనర్ శైలజ, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, కౌన్సిలర్లు బండారి సతీశ్ పాల్గొన్నారు.
క్యాట్ కృషి అభినందనీయం
గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (క్యాట్) చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాంద(టీ) గ్రౌండ్లో క్యాట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల స్కూల్ టెస్ట్ మ్యాచ్‌ను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, క్యాట్ అధ్యక్షుడు సునీల్బాబుతో కలిసి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను ఎమ్మెల్యే పరిచయం చేసుకొని అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో క్యాట్ నిర్వాహకులు రాణా ప్రతాప్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, ఎంపీపీ గోవర్ధన్, జైనథ్ మార్కెట్ వైస్ చైర్మన్ వేణు గోపాల్ యాదవ్, వెంకట్ రెడ్డి, లింగారెడ్డి, గోలి శంకర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.