బజార్ హత్నూర్ : బజార్ హత్నూర్ మండలం జాతర్ల గ్రామంలో మహా శివరాత్రి సందర్భంగా వెంకటేశ్వర కళ్యాణం ( Venkateswara Kalyanam ) వైభవంగా నిర్వహించారు. ఆదిలాబాద్ (Adilabad ) ఎంపీ గోడం నగేష్ ( MP Godem Nagesh ) దంపతులు కల్యాణ మహోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా వేదంపండితులు మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గాయత్రి యజ్ఞం చేశారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ వెంకన్న, నాయకులు నానం రమణ, అల్కె గణేష్, శ్రీనివాస్, సుకుదేవ్, తాటిపెల్లి రాజు,రాజేశ్వర్, చందన్, కృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.