మంచిర్యాల (ఏసీసీ), ఆగస్టు 28 : యూనివర్సల్ కో ఆపరేటివ్ బ్యాంకుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.76.35 లక్షల లాభం వచ్చిందని చైర్మన్ వినయ్‌కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వైశ్యభవన్‌లో బ్యాంకు 46వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరానికిగాను వాటాదారులకు 11 శాతం డివిడెంట్ ప్రకటించినట్లు పేర్కొన్నారు. మంచిర్యాల, సీసీసీలలో ఏటీఎం సౌకర్యం కల్పించామని, సీనియర్ సిటిజన్లకు ఇతర బ్యాంకులతో పోలిస్తే డిపాజిట్లపై అధికంగా వడ్డీ ఇస్తున్నామని, వారు బ్యాంకుకు రాలేని పరిస్థితుల్లో ఇంటికెళ్లి సర్వీసు చేస్తామని తెలిపారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా సహకార అధికారి బీ సంజీవరెడ్డి బ్యాంకు సాధించిన ప్రగతిని ప్రశంసించారు. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు. బ్యాంకు ఇన్చార్జి సీఈవో కేవీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ యూనివర్సల్ కో ఆపరేటివ్ బ్యాంకు చిన్న, మధ్య తరగతి ప్రజలకు రుణ సదుపాయం కల్పిస్తూ, వారి ఆర్థిక ప్రగతికి తోడ్పడుతుందన్నారు. అలాగే బ్యాంకు నుంచి రూపే డెబిట్ కార్డు, క్యూఆర్ స్కానర్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.
ఇతర ప్రాంతాల్లో బ్యాంకు బ్రాంచీలను నెలకొల్పుతామని పేర్కొన్నారు. బ్యాంకు ప్రగతికి సహాయ సహకారాలు అందిస్తున్న వాటాదారులు, ఖాతాదారులు, రిజర్వ్ బ్యాంకు, సహకార శాఖ, మున్సిపల్ అధికారులు, బ్యాంకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ జీ పూర్ణచంద్రరావు, డైరెక్టర్లు కేఎస్ఎం రావు, కృష్ణమూర్తి, శ్రీదేవి, బక్కయ్య, ప్రసాదరావు, రాజలింగు, భానుప్రకాశ్, రత్నం, సుశీల భాగ్యలక్ష్మి, ఆదిత్య, శ్రిపతి శ్రీనివాస్, వాటాదారులు , తదితరులు పాల్గొన్నారు.