రెబ్బెన, మార్చి 9 : బిహార్ రాష్ట్రం పాట్నాలో ఈ నెలా 10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న అండర్-19 బాలుర జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు గోలేటికి చెందిన క్రీడాకారులు గట్టు గోపాల్, పిన్సింగుల సాయిచరణ్ ఎంపికైనట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి ఆర్.నారాయణరెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నర్సింగం, సంయుక్త కార్యదర్శి ఎస్.తిరుపతి, సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసరెడ్డి, టగ్ ఆఫ్ వార్ ప్రధాన కార్యదర్శి భాస్కర్, షార్ప్స్టార్ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు, కోశాధికారి శంకర్, సీనియర్ క్రీడాకారులు కుమ్మరి మల్లేశ్, రామకృష్ణ, హరిలాల్, గుజ్జ మల్లేశ్, చందర్ క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.