ఎదులాపురం, డిసెంబర్ 13 : రిమ్స్ రోగుల కు మెరుగైన వైద్యసేవలతోపాటు అరుదైన ఆపరేషన్లను చేస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తెలిపారు. ఇటీవల న్యూరోకు సంబంధించి రెండు ఆపరేషన్లను విజయవంతంగా చేయడంతో బుధవారం రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో వివరాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా జైసింగ్ రాథోడ్ మా ట్లాడుతూ.. ప్రైవేట్‌లో పెద్ద ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్లను ఇకడ చేస్తున్నామన్నారు. న్యూరోకు సంబంధించి డాక్టర్ విజయ్‌మోహన్ రెండు ఆపరేషన్లు చేశారని, రోగులు ప్ర స్తుతం బాగున్నారని తెలిపారు. అనంతరం న్యూరో వైద్యుడు విజయ్ మోహన్ మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన సతీశ్ నడుము నొ ప్పి, కాళ్లు తిమ్మిళ్లతో బాధపడుతూ రిమ్స్‌లో చేరారన్నారు.
అదేవిధంగా ఈనెల 2న తలమడుగు మండలంలోని పల్సి(కే)కు చెందిన లక్ష్మీ తలకు గాయం కారణంగా రిమ్స్‌లో చే రారని తెలిపారు. వీరిని పరీక్షించి సానింగ్ తీసి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం రోగులు కొలుకుంటున్నారని, త్వరలోనే వారికి డిశ్చార్జీ చేస్తామన్నా రు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ అశోక్, ఆర్ఎంవో చంపత్ రావ్ పాల్గొన్నారు.