తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ( Marijuana ) విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు (Arrest) చేసినామని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య( CI Devaiah) తెలిపారు.
గోలేటి ప్రాంతానికి చెందిన అడ్డూరి జగన్, జంగంపల్లి ప్రశాంత్ అనే ఇద్దరు యువకులు మాదారం వన్ ఇంక్లైన్ సమీపంలో గంజాయి తీసుకు వస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. వెంటనే మాదారం ఎస్సై సౌజన్య (SI Soujanya) సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా వారి నుంచి 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొన్నామని వివరించారు.
ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని వెల్లడించారు. ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ తెలిపారు.