కోటపల్లి, సెప్టెంబర్ 3 : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ దగ్గరవుతున్న ఆర్టీసీ.. ప్ర యాణికుల సౌకర్యార్థం మరో సరికొత్త యాప్‌ను రూపొందించింది. బస్సుల సమాచారాన్ని క్షణాల్లో ప్రయాణికులకు తెలిపేలా అత్యాధునిక ఫీచర్లతో ‘గమ్యం’ యాప్‌ను ఆవిష్కరించింది. ప్ర యాణికులు అరక్షణంలోనే ఆర్టీసీ సమాచారాన్ని తెలిపేందుకు ఈ యాప్ ఎంతో ఉపయుక్తంగా ఉంది. పల్లె వెలుగు బస్సులు మినహా అన్ని బస్సులకు ట్రాకింగ్ సౌకర్యం కల్పించారు. ప్రయాణికులు కూర్చున్న చోటు నుంచే తాను ప్రయాణించే బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునే సౌకర్యం ఏర్పడింది. ఈ యాప్‌ను గుగూల్ ప్లే స్టోర్‌లో ‘టీఎస్ఆర్టీసీ గమ్యం’ పేరుతో పాటు www.tsrtc. telangana.gov.in సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా రాజధాని, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌లకు సంబంధించిన బస్సు లొకేషన్‌తో పాటు ఆ బస్సు గమ్యస్థానానికి ఎప్పుడు చేరుకుంటుందో ఇట్టే తెలుసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రయాణికులు సర్వీస్ నం బర్ ఆధారంగా బస్సు లొకేషన్‌ను తెలుసుకొని బస్టాండ్‌కు వెళ్లేందుకు ఉపయోగపడనున్నది. యాప్‌లో బస్ రూట్‌తో పాటు మన స్టేజ్‌కు ఎన్ని గంటలకు చేరుకుంటుంది? డైవర్ సెల్ నంబర్ వంటి వివరాలు ఉంటాయి.
సరికొత్తగా యాప్..
టీఎస్ ఆర్టీసీ రూపొందించిన గమ్యం యాప్ సరికొత్తగా రూపొందించారు. ఈ యాప్‌తో ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు మరింత చేరువ కానున్నాయి. గతంలో టీఎస్ ఆర్టీసీ పేరిట యాప్ ఉన్నప్పటికీ ఈ యాప్ బస్సుల రిజర్వేషన్ కోసం మాత్రమే పని చేసేది. కొత్తగా, సరికొత్తగా రూపొందించిన ఈ యాప్ ద్వారా మహిళా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసేలా రూపొందించారు. అత్యవసర సమయంలో ఈ యాప్‌ను 100, 108 కాల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ఈ యాప్‌లో ఎమర్జెన్సీ బటన్‌ను సైతం పొందుపర్చారు. ఈ బటన్‌ను ప్రెస్ చేస్తే అందులో మహిళా భద్రత, బస్సు బ్రేక్ డౌన్, మెడికల్ ఎమర్జెన్సీ, యాక్సిడెంట్ తదితర విషయాలను యాప్ ద్వారా పై అధికారులకు నివేదించవచ్చు. అత్యవసర సమయంలో ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా ఈ యాప్‌ను రూపొందించగా, ప్రయాణికుల భద్రతకు కూడా ప్రాధాన్యం కల్పించినట్లయింది. వీటి తో పాటు ‘ఫాగ్ ఏ బస్’ అనే ఆప్షన్‌ను ఈ యాప్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఆప్షన్ ఏర్పాటు చేసి మహిళా ప్రయాణికులు వారి వివరాలను న మోదు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణం చేసే మహిళా ప్రయాణికులు బస్సు స్టాప్‌లు లేని చోట నిరీక్షిస్తే ఈ యాప్ లో తమ వివరాలు నమోదు చేయాలి. మొబైల్ తెరపైన ఆకుపచ్చ లైట్ వెలుగుతుంది. దీన్ని ఆ రూట్లో వచ్చే బస్సు డ్రైవర్‌కు చూపుతుంది. దీనిద్వారా బస్టాప్ లేకపోయినా మహిళా ప్రయాణికులను బస్సులో ఎక్కించుకొని క్షేమంగా వారి గమ్య స్థానానికి చేర్చనున్నారు. రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ఆప్షన్ మహిళా ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు
టీఎస్ఆర్టీసీ గమ్యం యాప్ ద్వారా బస్సు సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రయాణికులు ఈ యాప్ ద్వారా బస్సుల సమాచారాన్ని ఆన్లైన్ లొకేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. మంచిర్యాల డిపో పరిధిలో ఉన్న సూపర్ లగ్జరీ 27, రాజధాని 7, ఎక్స్‌ప్రెస్ 17 బస్సుల సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకునే సౌకర్యం ఉంది.
– రవీంద్రనాథ్, ఆర్టీసీ డీఎం, మంచిర్యాల