నిర్మల్ అర్బన్, మే 22 : పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షను శుక్రవారం నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ జూనియర్ కళాశాలలో 350, శాంతినగర్ కాలనీలోని బాలుర జూనియర్ కళాశాలలో 456, ప్రభుత్వ బాలిక ల జూనియర్ కళాశాలలో 456, ప్రభు త్వ డిగ్రీ కళాశాల(శాంతినగర్)లో 300, శాంతినగర్‌లోని బాలికల విద్యాలయం లో 384 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,946 మం ది పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఒక గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 11 గంటలు దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. పరీక్ష పకడ్బందీగా నిర్వహించడానికి విద్య, రెవెన్యూ, పోలీస్, వైద్య శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సదుపాయం, వైద్య సౌకర్యాలను కల్పిస్తున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు పర్చనున్నారు. కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరని ప్రిన్సిపల్ అన్నపూర్ణ తెలిపారు.
ఎదులాపురం, మే 22 : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం ఈనె ల 24న పాలీసెట్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా సమన్వయకర్త భరద్వాజ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చే యగా.. ఇందులో 1,059 మంది పరీక్ష రాయనున్నారు. నలంద డిగ్రీ కాలేజీ(మావల)లో 411, విద్యార్థి డిగ్రీ కాలేజీ (రవీంద్రనగర్-ఆదిలాబాద్ టౌన్)లో 360, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (ఆర్ట్స్ అండ్ కామర్స్) హెడ్‌పోస్టాఫీస్, వన్ టౌన్ పో లీస్ స్టేషన్(ఆదిలాబాద్)లో 288 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పెన్సిల్, ఏరాజర్, బాల్ పాయింట్ పెన్, వాటర్ బాటిల్ తెచ్చుకోవాలన్నారు.