బజార్హత్నూర్, అక్టోబర్ 26 : గిరిజనుల ఆచార సంప్రదాయాలు ఎంతో గొప్పవని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. మండలంలోని జాత ర్ల గ్రామంలోని మినీ స్టేడియంలో మాజీ ఎంపీ గోడం నగేశ్, నవజ్యోతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన గుస్సాడీల ఆత్మీయ స మ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావు హాజరయ్యారు. ముందుగా గుస్సాడీ వేషధారణ సామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. అడవి బిడ్డల ఆచార సంప్రదాయాలు ఎంతో గొప్పవన్నారు. వాటిని భావితరాలకు అందించాలని కోరారు. ఆదివాసీ ప్రజలకు నిత్యం అందుబాటులలో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. అనంతరం మాజీ ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ.. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతియేటా గుస్సాడీల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్ర భుత్వం గుస్సాడీ బృందాలకు ప్రోత్సాహకంగా అందజేస్తున్న రూ.10వేల చెక్కులను ఐటీడీఏ పీవో అందజేశా రు. వివిధ గ్రామా లు, మండలాల నుంచి వచ్చిన గుస్సాడీలు చేసిన సాంస్కృతిక నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, జడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య, తాటిపెల్లి రాజు, ఎంపీటీసీ ఈశ్వర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకన్న, నాయకులు చిల్కూరి భూమయ్య, నానం రమణ, రాము లు, వినాయక్, భోజన్న, మడావి కృష్ణారావ్, శ్రీనివాస్, వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.