కాసిపేట : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలంలోని పలు గిరిజన తండాల్లో పారిశుద్ధ్యం లోపించింది. మురికి కాలువులు శుభ్రం చేయకపోవడంతో ఇళ్లలోకి మురికి నీరు చేరుతుందని లంబాడీతండా(కే) గ్రామస్థులు శనివారం నిరసన తెలిపారు. గతంలో నేషనల్ హై వే పనులు జరుగుతున్న సమయంలో కల్వర్టును పూర్తిగా తొలగించారని దీంతో సోమగూడెంలోని డ్రైనేజీ, మురుగు నీరు లంబాడీ తండా (కే)లోని ఇళ్లలోకి చేరుతుందని వాపోయారు.
దీని వల్ల రోగాల పాలవుతున్నామని మండిపడ్డారు. వర్ష కాలం కావడంతో మురుగు నీరు చెత్త చెదరం నిలువతో దోమలు వ్యాపించి విష జ్వరాలపాలవుతున్నామని, సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.క్లోరినేషన్ లేక దోమలతో రోగాల బారిన పడుతున్నా పట్టించుకునే నాధుడే లేడని, అసలు అధికారులు ఉన్నారా అని మండి పడ్డారు. గ్రా మంలో వీధి దీపాలు లేవని, పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని, ఉన్నత అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరించాలని కోరారు.