కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ( Elections) సంబంధించి స్టేజ్ 2 ప్రిసైడింగ్ అధికారులకు, జోనల్ అధికారులకు శిక్షణ(Training) కార్యక్రమం నిర్వహించారు. బ్యాలట్ బాక్సుల ( Ballot Box ) ఏర్పాటు, తీసే విధానం, సీల్ చేసే విధానాన్ని చూపించారు.
బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల నిర్వహణ ఎలా చేయాలి అనేది వివరించారు. అభ్యర్థులకు ఇచ్చే సూచనలు, పోలింగ్ కేంద్రంలో భద్రత ఏర్పాట్లను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, ఎంపీవో షేక్ సఫ్దర్ అలీ, ఎంఈవో ముక్తవరం వెంకటేశ్వర స్వామి, సీనియర్ అసిస్టెంట్ ఆకుల లక్ష్మీ నారాయణ, కాంప్లెక్స్ హెచ్ఎం సాంబ మూర్తి, అన్నం రమణారెడ్డి, జూనియర్ అసిస్టెంట్ కోదాది తిరుపతి, ప్రిసైడింగ్ అధికారులకు, జోనల్ అధికారులకు పాల్గొన్నారు.