మంచిర్యాలటౌన్, జూలై 28: మంచిర్యాల పట్టణంలో కమర్షియల్ బిల్డింగ్‌లో నిర్మించిన వ్యాపారులు, భవన యజమానులు నిబంధనలు పాటించడం లేదు. పార్కింగ్‌కోసం ఏ ర్పాటు నిర్మించుకున్న సెల్లార్ స్థలాలను దుకాణాలు, గోదాముల నిర్వహణకు కిరాయికి ఇ స్తున్నారు. సెల్లార్లలో పార్కింగ్ చేయాల్సిన వాహనాలు రోడ్డుకు మధ్యన నిలుపుతుండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్నది.
మంచిర్యాలలోని మార్కెట్‌రోడ్, స్టేషన్‌రోడ్, బస్టాండ్, గంగారెడ్డిరోడ్, మెయిన్‌రోడ్, ఐబీ చౌరస్తా ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలతో పాటు రాళ్లపేటరోడ్డులో ప్రైవేట్ దవాఖానాల కోసం పెద్ద భవనాలు నిర్మించారు. వీటి లో చాలావరకు భవనాలు సెల్లార్లను కలిగి ఉ న్నాయి. ఎవరూ వీటిని పార్కింగ్ కోసం వినియోగించకుండా దుకాణాలు, హోటళ్లు, తదితర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
ఈ విషయంలో ఎప్పటికప్పుడు నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సెల్లార్ల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దాదాపు 25 మంది భవన యజమానులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చర్యలు తీసుకుంటాం
-మారుతీప్రసాద్, మున్సిపల్ కమిషనర్
సెల్లార్లలో వ్యాపారాలు సాగించే వారిని గుర్తించి వారికి నోటీసులు ఇచ్చాం. వారికి కొంత గడువు ఇచ్చాం. ఈ లోగా వారు దుకాణాలను తొలగించకపోతే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటాం. సెల్లార్లు ఉండి వ్యాపారాలు సాగిస్తున్న ప్రతి భవన యజమానికీ త్వరలో నోటీసులు ఇస్తాం. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సాగుతున్నందున కొంత ఆలస్యమవుతుంది. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలపై ఫిర్యాదులు అందుతున్నాయి. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతాం.