నార్నూర్, అక్టోబర్ 25 : ఆదివాసులు నియమ నిష్టలతో ఆచరించే సంస్కృతీ, సంప్రదా యాలు పవిత్రమైనవని ఆదిలాబాద్ జిల్లా పరిష త్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. గాది గూడ మండలం లోకారి(కే), లోకారి(బీ), రోమన్కాసా, బుయిలికాసా గ్రామాల్లో సోమ వారం పర్యటించారు. ప్రభుత్వం మంజూరు చేసిన దండారీ చెక్కులు నిర్వాహకులకు అందజే శారు. ఆదివాసీలు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. శాలువాతో సన్మానిం చారు. ఏత్మాసూర్ పేన్కు దండారీ నిర్వాహకులతో కలిసి సంప్రదా య పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దండారీ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ రూ.కోటి మం జూరు చేశారన్నారు. ప్రతి దండారీ నిర్వాహ కుడికి రూ.10వేల చొప్పున అందిస్తారని తెలిపారు. గాదిగూడ మండలంలోని నాలుగు గ్రామాలకు చెందిన దండారీ నిర్వాహకులకు రూ.10వేల చొప్పున పంపిణీ చేశారు.
గిరిజనుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ఏత్మాసూర్ పేన్ ఆశీస్సులతోపాటు ప్రజల ఆశీర్వా దం ఉండాలని వేడుకున్నారు. వైస్ ఎంపీపీ మర్సి వనే యోగేశ్, సర్పంచ్లు మెస్రం దేవ్రావ్, మెస్రం జారు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ మండలాధ్యక్షుడు పుసం బాదిరావ్, జీవవైవిధ్య జిల్లా కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి, ఉపాధ్యా యులు మెస్రం శేఖర్, మెస్రం లింగు, మడావి చంద్రహరి, దండారీ నిర్వాహ కులు ఉన్నారు. అలాగే భీంపూర్ గ్రామ పరిధిలో ని గోండుగూడలో దండారీ నిర్వాహకుడికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10వేల చెక్కును సర్పంచ్ రాథోడ్ విష్ణు అందించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు అత్యంత వైభవంగా నిర్వహించే దండారీ ఉత్స వాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల చొప్పున అందించడం హర్షనీయమన్నారు. జీవ వైవిధ్య కమిటీ జిల్లా సభ్యుడు జాదవ్ విశ్వనాథ్, గ్రామ పటేల్ శ్యాంరావు, సుభాష్, శ్రీకాంత్ ఉన్నారు.
ఆదివాసీల సంక్షేమానికి కృషి
భీంపూర్, అక్టోబర్ 25 : ఆదివాసీల సంక్షేమా నికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని ఆదిలాబాద్ మాజీ ఎంపీ గొడాం నగేశ్ పేర్కొ న్నారు. భీంపూర్లో సోమవారం ఆయన డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఐటీడీఏ చైర్మన్ కనాకె లక్కేరావు, జడ్పీటీసీలు కుమ్ర సుధాకర్, తాటిపెల్లి రాజుతో కలిసి 37 దండారీ బృందాలకు రూ.3.70 లక్షల విలువైన చెక్కులను అందజే శారు. దండారీ సంబురాల్లో పాల్గొన్నారు. భీంపూ ర్లో ఐదుగంటలపాటు కొనసాగిన దండారీ వేడు కల్లో మాజీ ఎంపీతోపాటు ప్రజాప్రతినిధులు ఆడిపాడారు. సర్పంచ్లు మడావి లింబాజీ, చిన్ను, రూప, బాదర్, ఉపసర్పంచ్ జాదవ్ రవీందర్, నాయకులు కుడిమెత సంతోష్, పాం డురంగ్, పురుషోత్తం, ఉత్తంరాథోడ్, తొడ సం అమృత్రావు, భీంరావు, మాణిక్రావు, నాయకు లు, కార్యకర్తలు ఉన్నారు.
దండారీ ఉత్సవాలకు ప్రాధాన్యం
బోథ్, అక్టోబర్ 25 : తెలంగాణ ప్రభుత్వం దండారీ ఉత్సవాలకు ప్రాధాన్యం ఇస్తున్నదని ఐటీడీఏ డైరెక్టర్ మెస్రం భూమన్న పేర్కొన్నారు. మండలంలోని పార్డీ (బీ) రాయిసెంటర్లో 18 గ్రామాలకు చెందిన గుస్సాడీలకు దండారి చెక్కు లు అందజేశారు. 18 గ్రామాల పటేళ్లకు చెక్కులు అందజేశారు. టీ భూమన్న, సర్పంచ్ మారుతి, లాల్రాం, బండు, గంగాధర్. ఆయా గ్రామాల పటేళ్లు, దేవరిలు, మహాజన్లు పాల్గొన్నారు.
ఇచ్చోడలో..
ఇచ్చోడ, అక్టోబర్ 24 : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డితో కలిసి ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్ 31 గ్రామా లకు సంబంధించి ప్రభుత్వం అందించిన దండా రీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐటీడీఏ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 6 నుంచి 10 శాతం రిజర్వేషన్ పెంచిందని గుర్తు చేశారు. స్థానిక సర్పంచ్ సునీత, వైస్ ఎంపీపీ కడప కమల జాలై జాకు, ఐటీడీఏ డైరెక్టర్ తులసీరామ్, ఇచ్చోడ ప్రధానోపాధ్యాయుడు ఉత్తమ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రాయిగూడలో..
సిరికొండ, అక్టోబర్ 24 : మండలంలోని రాయిగూడ గ్రామంలో 19 గ్రామాలకు వచ్చిన దండారీ చెక్కులను సర్పంచ్ జుగ్నక్ లక్ష్మి, ఎంపీపీ పెందూర్ అమృత్ రావ్, స్థానిక ఆదివాసీ పటేళ్లతో కలిసి అందించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు జుగ్నక్ కృష్ణ, అమృత్ రావ్, వివిధ గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీలు, పటేళ్లు పాల్గొన్నారు.
నేరడిగొండలో..
నేరడిగొండ, అక్టోబర్ 25 : మండలంలోని ఆదివాసీ గూడేలకు ప్రభుత్వం మంజూరు చేసిన దండారీ చెక్కులను మండల పరిషత్ సమావేశపు హాలులో జడ్పీటీసీ జాదవ్ అనిల్ అందజేశారు. మండలంలోని 27 ఆదివాసీ గ్రామాలకు మంజూ రు కాగా ఒక్కొక్క గూడేనికి రూ.10 వేల చెక్కును అందించినట్లు ఆయన తెలిపారు. ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ పెంట వెంకటరమణ, మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ తిత్రే నారాయణసింగ్, లంబాడాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు జాదవ్ మహేందర్, లఖంపూర్ సర్పంచ్ కుమ్రం జంగు, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, భీంరావ్, తదితరులు పాల్గొన్నారు.