తాండూర్ : తాండూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ, ఎంజేపీ పాఠశాలలో స్పర్శ కుష్ఠు (Touch leprosy) వ్యాధి, స్ట్రెస్ మేనేజ్మెంట్, నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం పై డిప్యూటీ డీఎంహెచ్ వో సుధాకర్ నాయక్( Sudhakar Naik) , డాక్టర్ ఝాన్సీరాణి అవగాహన శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్మం పైన స్పర్శ లేని మచ్చలు ఉన్న, చెవుల మీద, ముఖం మీద కనితలు ఉన్న, కాళ్లు చేతులపై స్పర్శ తగ్గిన, కనురెప్పలు, కనుబొమ్మల వెంట్రుకలు రాలిన, పాదాలపై చేతులపై బొబ్బలు రావడం వంటివి కుష్ఠు వ్యాధి లక్షణాలని తెలిపారు. వాటి గురించి తెలుసుకొని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇచ్చే ఎండీటీ (MDT Medicines) ముందులను వాడాలని కోరారు.
ఈ సందర్భంగా స్పర్శ కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎంపీవో రాఘవయ్య, సీహెచ్ వో వెంకటేశ్వర్లు, హెచ్ఐవో లక్ష్మణస్వామి, సూపర్వైజర్ శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏఎన్ఎం శోభ, ఆశ కార్యకర్త తిరుమల, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.