చింతలమానేపల్లి : మండలంలోని డబ్బా ఎక్స్ రోడ్లో ఉన్న శ్రీ సాయి ఫెర్టిలైజర్ దుకాణంలో దొంగలు చోరీకి (Theft ) పాల్పడ్డారు. ఫెర్టిలైజర్ దుకాణం ( Fertilizer shop ) యజమాని అధికం మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 7 గం సమయంలో షాపును శ్రీకాంత్ అనే వ్యక్తి షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్లాడు.
బుధవారం ఉదయం వచ్చి చూడగా షాపు ముందు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఉన్నాయి. దీంతో దుకాణంలో సామాన్లు చిందరవందగా పడి ఉండడంతో కౌంటర్లో ఉన్న రూ. 60 వేలు, హార్డ్ డిస్క్, ఇతర సామాగ్రిని దుండగులు ఎత్తుకెళ్లారు . దుకాణపు యజమాని మహేష్ గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.