రెబ్బెన: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయమైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి దొంగతనం (Theft ) జరిగిందని రెబ్బెన (Rebbena ) ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. దొంగలు ఆలయం గేటు పగులగొట్టి లోపల ఉన్న హుండీని (Hundi) ధ్వంసం చేసి డబ్బులు దొంగిలించారని వివరించారు. సీసీ కెమెరాలు ఫుటేజ్ ద్వారా ఆధారాలు సేకరించామని తెలిపారు. ఆలయ ఈవో బాపిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నుట్ల ఎస్సై వెల్లడించారు.