ఎదులాపురం, అక్టోబర్ 24 : సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకం గా వ్యవహరిస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి తమ వంతు గా కృషి చేస్తున్న పలువురు యువ కులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జోగు రామన్నకే తమ మద్దతు ఉంటుందని యువకులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్లో చేరారు. యువకులమంతా ఎమ్మెల్యే నాయక త్వాన్ని బలపరుస్తున్నామన్నారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ దేశం లోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ నిలిచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వెసి గెలిపించా లన్నారు. పార్టీలో చేరిన వారు సాబీర్ పటేల్, జునైద్ అహ్మద్, నదీమ్, షాహిద్, అఫ్రోజ్, పలువురు యువకులు ఉన్నారు.
బహుమతులు అందజేత
వినాయక నవరాత్రుల సందర్భంగా ఆదిలాబాద్లో ప్రతి ష్ఠించిన పలు గణేశ్ మండపాలకు హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వ ర్యంలో బహుమతులు అందజేశారు. ఆది లాబాద్లోని నటరాజ్ థియేటర్ చౌరస్తా లోని శ్రీ యువ శక్తి యూత్ గణేశ్ మండ లి వారు 45 సంవత్సరాలుగా వినాయక విగ్రహ స్థాపన, సాంస్కృతిక కార్యక్రమా లు నిర్వహిస్తున్నందున, దసరా వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ లోని దసరా మైదానంలో సోమవారం ఎమ్మెల్యే జోగు రామన్న, సమితి అధ్యక్షుడు హను మాం డ్లు ఉత్తమ వినాయక మండలి అవార్డును సభ్యులకు అందజేశారు. కార్యక్ర మం లో యువ శక్తి యూత్ గౌరవాధ్యక్షుడు బండారి సతీశ్, సీహె చ్ కార్తీక్, సాయి, అజంత్, సుగత్ కుమార్, రమణ పాల్గొన్నారు.