నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు సమీపంలో గల మిర్జాపూర్ గ్రామ పరిధిలో నిర్మిస్తున్న సెకండ్ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్ పనులు తుది దశకు చేరుకున్నాయి. 162 సర్వే నంబర్లోని పదెకరాల్లో నిర్మిస్తున్నారు. మూడు బృందాలలో 500 మంది ప్రత్యేక బలగాలు ఉండనున్నాయి.
గణేశ్ నిమజ్జనో త్సవం, దుర్గాదేవి నవరాత్రోత్సవాల సందర్భంగా ప్రత్యేక బలగాలు అవరసమయ్యేవి. ఈ బలగాలను వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల నుంచి రప్పించడానికి అధిక సమయం పట్టేది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగేది. సెకండ్ బెటాలియన్ నిర్మాణంతో ఈ సమస్యకు చెక్ పడనుంది. ఈ భవనాలు త్వరలో ప్రారంభం కానున్నాయి.
– భైంసా, మే, 13