భైంసాటౌన్/ముథోల్, డిసెంబర్ 3: ఓటరు నమో దు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, త ప్పిదాలకు తావివ్వద్దని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. భైంసా మండలంలోని మాటే గాం, ముథోల్ మండలంలోని తరోడా ఓటరు న మోదు కేంద్రాలను శనివారం సందర్శించారు. ప్ర త్యేక ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. పలు వివరాలను బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఓటరు నమోదు, సవరణలపై ప్ర జల్లో అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నమోదు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఆఫ్లైన్లో వచ్చిన దరఖాస్తులను డిజిటలైజేషన్ చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, అధికారులు ఉన్నారు.
ఓటరు జాబితాలో నమోదు చేయాలి:ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఎదులాపురం,డిసెంబర్ 3: అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేయాలని కలెక్టర్ సి క్తా పట్నాయక్ అన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం డైట్ కళాశాల, ప్రభుత్వ కామర్స్ ఆర్ట్స్ కళాశాలలోని కేంద్రాలను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశా రు. దివ్యాంగ ఓటర్ల పేర్ల వద్ద మార్కింగ్ చేయాలని సూచించారు. నమోదు మార్పులు ,చేర్పులకు సంబంధించిన ఫారాలను పోలింగ్ కేంద్రా ల్లో అందుబాటులో ఉంచాలన్నారు. అర్బన్ తహసీల్దార్ సతీశ్, నాయబ్ తహసీల్దార్లు ప్రవీణ్ కు మార్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
రూ.40 కోట్లతో మిషన్ భగీరథ
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 3: రూ. 40 కోట్లతో మిషన్ భగీరథ పనులను చేపట్టినట్లు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. నిర్మల్ పట్టణంలోని ఇసురాళ్ల గుట్టవద్ద కొత్తగా నిర్మిస్తున్న పంప్ హౌస్, సర్వీస్ రిజర్వాయర్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈనెల చివరి కల్లా ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయాలని పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు. అంతకుముందు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిషన్ భ గీరథ పనులను అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించా రు. శానిటేషన్ సిబ్బందికి బయోమెట్రిక్ ఏర్పా టు చేయాలని, ఉదయం 6 గంటల లోగా హాజరయ్యేలా చూడాలన్నారు. పన్నులు సకాలంలో వసూలు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, నిర్మల్, ఖానాపూర్ కమిషనర్లు సంపత్ కుమార్, రత్నాకర్, పబ్లిక్ హెల్త్ డీఈ సంతోష్, ఈఈ నాగేశ్వర్ రావు, హరి భూ షణ్ తదితరులున్నారు.