ఆదిలాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉపాధి రంగాలకు పెద్దపీట వేస్తున్నది. రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసి పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియం చదువులతో పాటు, పౌష్టికాహారం, క్రీడలు, ఇతర అంశాల్లో మెరుగైన శిక్షణ ఇస్తున్నది. చదువుకున్న యువత ఉద్యోగాలు పొందేందుకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తున్నది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసేందుకు వీలుగా ఐటీ రం గాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటుకు చే యూతనందిస్తున్నది. భారీగా ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీ చేస్తున్న ప్ర భుత్వం నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించేలా వారికి చేయూతనందిస్తున్నది. గతంలో ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడానికి హైదరాబాద్‌కు ప్రైవేటు కోచింగ్ సెంటర్ శిక్షణకు కోసం పేదలు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ప్రభుత్వం స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయడంతో వారికి స్థానికంగా శిక్షణ లభిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ స్టడీ సర్కిళ్ల ద్వారా వారికి ఉచితంగా శిక్షణ అందజేస్తున్నది. యువతకు ఉచితంగా భోజన సౌకర్యం, స్టడీ మెటీరియల్, ైస్టెఫండ్ అందజేస్తున్నది. ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొం దిన నిరుద్యోగులు ప్రభుత్వం అందిస్తున్న సాయంతో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ శిక్షణ పొందిన 235 మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగా మూడ్రోజుల కిందట వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో 48 మంది ఎంపికయ్యారు.
ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో నిరుద్యోగులకు మెరుగైన శిక్షణ లభిస్తున్నది. ఇందులో 90 మంది పోలీసు కానిస్టేబుల్ శిక్షణ తీసుకోగా 48 మంది ఉద్యోగాలు సాధించారు. పోలీసు నియామక ప్రక్రియ ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్‌లో శిక్షణ ఇచ్చారు. ప్రిలిమ్స్‌లో మూడు నెలలు, ఈవెంట్స్‌లో నెల రోజులు, మెయిన్స్‌లో మూడు నెలలపాటు నిరుద్యోగులు శిక్షణ పొందారు. పోటీ పరీక్షల్లో భాగంగా వివిధ విషయాలను నిపుణులు బోధిస్తారు. ఇక్కడ పరీక్షలు కోసం సిద్ధం కావడానికి పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, తెలంగాణ అంశాలు, అర్థమెటిక్ రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్ లాంటి స్టడీ మెటీరియల్ ఉంటుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వర కు తరగతులు 24 గంటల పాటు లైబ్రరీ, స్టడీ హాళ్లు అందుబాటులో ఉంటాయి. క్లాస్, వీక్లీ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న నిరుద్యోగులకు ఉచితంగా భోజనం సౌకర్యం కల్పించడంతో పాటు స్టడీ మెటీరియల్ అందించారు. చేశారు. మున్సిపాలిటీ అధ్వర్యంలో స్టడీ హాల్ సామగ్రి, పుస్తకాలు సమకూర్చారు.
బీసీ స్టడీ సర్కిల్లో నిరుద్యోగులకు శిక్షణ ఇ చ్చాం. రాష్ట్రంలో ఇక్కడ నుంచే ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించి మొదటి స్థా నంలో నిలిచారు. 90 మంది శిక్షణ తీసు కుంటే 48 మంది ఉద్యోగాలు సాధించారు. స్టడీ సర్కిల్లో అన్ని రకాల పోటీ పరీక్షలకు మెరుగైన శిక్షణ అం దిస్తున్నాం. వివిధ అంశాల్లో నిపుణులైన అధ్యాపకుల చేత శిక్షణ, నమూనా పరీక్షలు, లైబ్రరీ, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్టడీ హాల్ సౌకర్యం ఉంటుంది. యువతకు పలు అంశాల్లో సలహాలు, సూచలను అందజేస్తాం.
– ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్, బీసీ స్టడీ సర్కిల్, ఆదిలాబాద్
నేను ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో పోలీసు ఉద్యోగానికి శిక్షణ తీసుకొని టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాను. మాది వ్యవసాయ కు టుంబం, మా అమ్మ వ్యవసాయం చేస్తూ న న్ను చదివించింది. డిగ్రీ వరకు చదువుకుని పోలీసు ఉద్యోగం కో సం ప్రిపేర్ అయ్యాను. శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ ఉద్యోగం రావడానికి ఎంతో ఉప యోగపడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టడీ సర్కిళ్లు పేద విద్యా ర్థులకు వరంగా చెప్పవచ్చు.
నేను సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో నిరు ద్యోగులకు చదువుకునేందుకు అన్ని రకాల సౌ కర్యాలు ఉన్నాయి. యువత చదువుకు నేందుకు అనుకూలమైన వాతావరణం ఉంది. వివిధ అంశాలను బోధించడంతో పాటు ఇక్క డి స్టడీ మెటీరియల్, లైబ్రరీ, స్టడీ హాల్ సౌకర్యవంతంగా ఉన్నాయి. నిరుద్యోగ యువత ఉ ద్యోగాలు సాధించేందుకు ఇలాంటి స్టడీ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుంది.
– ప్రవీణ్, ఎంపికైన అభ్యర్థి, ఆదిలాబాద్
నేను డిగ్రీ వరకు చదువుకొని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ప్రిపేర్ అయ్యాను. గతంలో ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల కోచింగ్ కోసం హైదరాబాద్ లాంటి పట్టణాలకు పోయి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేంది. ఇప్పుడు యువత స్టడీ సర్కిళ్లల్లో శిక్షణ తీసుకుంటూ ఉద్యోగాలు సాధిస్తున్నారు. నేను మూడు నెలల పాటు బీసీ స్టడీ సర్కిల్లో ప్రిపేర్ అయి సివిల్ పోలీసు ఉద్యోగం సాధించాను. మాలాంటి పేద విద్యార్థులకు ఈ సెంటర్లు ఎంతో ప్రయోజకరంగా మారాయి.
– కస్తాల రాహుల్, ఎంపికైన అభ్యర్థి, మావల, ఆదిలాబాద్ జిల్లా