నిర్మల్ అర్బన్, జూలై 27 : నిర్మల్ పట్టణంలోని పాల్టెక్నిక్ కళాశాలలో గ్రామ పరిపాలన అధికారులు, లైసెన్స్ సర్వేయర్ల నియామక పరీక్షను ఆదివారం నిర్వహించారు. ఈ పరీక్ష కేంద్రాన్ని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. జీపీఏ పరీక్షకు 55 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా.. 37 మంది హాజరై.. 18 మంది గైర్హాజరయ్యారు. అలాగే లైసెన్స్ సర్వేయర్ల పరీక్షకు 110 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 84 మంది హాజరయ్యారయ్యారు. ఈ తనిఖీల్లో ఆర్డీవో రత్న కల్యాణి, నోడల్ అధికారి సుదర్శన్, పర్యవేక్షకులు మోతీరాం, సూర్యారావు, రాజేశ్వర్‌గౌడ్, తహసీల్దార్ రాజు పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లో..
ఎదులాపురం, జూలై 27 : గ్రామ పాలన అధికారుల నియామకం కోసం ఆదివారం స్థానిక నలంద కాలేజీలో నిర్వహించిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా తనిఖీ చేశారు. ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు కొనసాగిన పరీక్షకు 51 మంది అభ్యర్థులకు 48 మంది హాజరై, ముగ్గురు గైర్హాజరయ్యారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్యామలదేవి, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ శ్రీనివాస్, డీటీ ఇస్తార్ ఉన్నారు.
ప్రశాంతంగా ల్యాండ్ సర్వేయర్ పరీక్ష
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ అండ్ కామర్స్‌లో ఏర్పాటు చేసిన లైసెన్డ్స్ ల్యాండ్ సర్వేయర్ల అర్హత పరీక్ష కేంద్రాన్ని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా 155 మందికి 129 మంది హాజరు కాగా 26 మంది గైర్హాజరయ్యారని అన్నారు.