రెబ్బెన, జనవరి 5 : గోలేటి గ్రామ పంచాయతీలో అయోధ్య రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీరాముని అక్షింతలు, శ్రీరాముని ప్రతిమల శోభాయాత్ర శుక్రవారం కనుల పండువగా సాగింది. గోలేటిలోని హనుమాన్ మందిరం నుంచి గోలేటిటౌన్‌షిప్ కార్మిక కాలనీలో గల కోదండ రామాలయం వరకు సాగింది. మహిళలు మంగళహారతులతో తరలివచ్చారు.
పూజలు నిర్వహించి శ్రీ రాముని అక్షింతలు తీసుకున్నారు. 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులంతా తమ ఇండ్ల వద్ద 5 దీపాలు వెలిగించి కోదండ ఆలయానికి రావాలని అర్చకుడు సంతోష్‌శర్మ పేర్కొన్నారు. బెల్లంపల్లి ఏరియా జీఎం రవిప్రసాద్, ఎస్వోటు జీఎం మచ్చగిరి నరేందర్ ప్రత్యేక పూజలు చేసి.. అక్షింతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో గోలేటి గ్రామ సర్పంచ్ పొటు సుమలత, మాజీ సర్పంచ్ సోల్లు లక్ష్మి, మాజీ ఎంపీటీసీ సురేందర్‌రాజు, మాజీ ఉపసర్పంచ్ రవినాయక్, ఆలయ మాజీ కార్యదర్శి సంగెం ప్రకాశ్‌రావు, మాజీ కోశాధికారి దాసరి సాంబగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొటు శ్రీధర్‌రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులుగౌడ్, తీర్థ క్షేత్ర ట్రస్ట్ గోలేటి కార్యదర్శి సంతోష్‌శర్మ, సహా సంయోజక్ విజయ్‌కుమార్, సభ్యులు గోలెం విలాస్, పత్తెం రాజు, పోతురాజుల భీమేశ్, పంబాల శ్రీనివాస్, పరికిపండ్ల సత్యనారాయణ, కేసరి కిషన్‌గౌడ్, లింగమూర్తి, జటంగుల సంజయ్, శ్రీరాం, రాజశేఖర్, సంతోశ్, సతీశ్, శ్రీకాంత్ ఉన్నారు.