వాంకిడి, మార్చి 13: నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్పష్టం చేశారు. వాంకిడి మండలంలోని గోండు కోసర, కోపగూడ, వెల్గి, ఎనోలి, పిప్పర్గొంది గ్రామాల్లో ఐటీడీఏ నిధులు రూ.21 కోట్లతో మంజూరైన బీటీ రోడ్లు, బ్రిడ్జి నిర్మాణ పనులకు బుధవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ ముండే విమలాబాయి, జడ్పీటీసీ అజయ్ కుమార్, ఎంపీటీసీ హివ్రే ప్రవీణ్, మాజీ సర్పంచులు తుకారాం, అయ్యూబ్, కిష్టు, సోనేరావు, మనోహర్, నాయకులు ముండే దీపక్, బాబూలాల్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గుర్నూలే నారాయణ, ప్రశాంత్, బీఆర్ఎస్ యువజన మండలాధ్యక్షుడు ఎంగలి రాకేశ్, శైలేష్, అశోక్, బబ్లూ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.