ఆదిలాబాద్ : ఇటీవల కురిసిన వర్షాలతో వరి,జొన్న పంటలు తడిసాయని ,రైతులు నష్టపోకుండా ప్రభుత్వం తడిసిన పంటలను ( Wet crop) కొనుగోలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ( MLA Anil Jadhav ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా జొన్నలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.
రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, తడిసిన ప్రతీ ధాన్యం గించను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ (BRS Party) తరపున ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వీరి వెంట మాజీ ఎంపీపీలు రాథోడ్ సజన్, తుల శ్రీనివాస్, ప్రీతం రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ నానక్ సింగ్, మాజీ ఉప సర్పంచులు దేవేందర్ రెడ్డి, శిరీష్ రెడ్డి, కృష్ణ రెడ్డి, సురేందర్ యాదవ్, ప్రశాంత్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.