నిర్మల్ అర్బన్, మార్చి 13 : అధైర్యపడవద్దని.. యావత్ తెలంగాణ సమాజం ఎమ్మెల్సీ కవితకు అండగా ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో భారత జాగృతి వ్యవస్థాపకు రాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడు కలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ వైఫల్యాలను ఎండగడుతు న్నందుకే మహిళా అని చూడకుండా కక్ష కట్టారని ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మారెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సి లర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌కు మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ట్రిపుల్ ఆర్కు ఆసార్ అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
మహిళా ప్రపంచాన్ని కదిలించింది కవిత
ఎదులాపురం, మార్చి13 : ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ధర్నా చేపట్టి యావత్ మహిళా ప్రపం చాన్ని కదిలించింది. ఎమ్మెల్సీ, జాగృతి వ్యవస్థాప కురాలు కవిత అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత జన్మదిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని రిమ్స్ దవాఖాన చిన్న పిల్లల వార్డులో ఎమ్మెల్యే పండ్లు పంపిణీ చేశారు. ముందుగా కేక్ కట్ చేసి తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్‌కు తినిపించారు. అనంతరం ఎమ్మెల్సీ కవితకు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జాగృతి సభ్యులు చెన్న సాయి కృష్ణ, గోలి శంకర్, గంట ప్రమోద్ కుమార్, శ్రీపాద కార్తీక్, అశోక్, జైనథ్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
భైంసాలో..
భైంసా, మార్చి 13 : భారత జాగృతి అధ్యక్షు రాలు ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కేక్ కట్ చేశారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పీ కృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బామ్ని రాజన్న, అసిఫ్, తాలుకా జాగృతి కన్వీనర్ పండిత్ రావు, దేవీదాస్, దత్తహరి, శ్యాంరావు పాటిల్, నూకం రామారావు, రాజేశ్ బాబు, తదితరులు ఉన్నారు.
ఖానాపూర్‌లో..
ఖానాపూర్ టౌన్, మార్చి 13 : ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే రేఖానాయక్ నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు అందజేశారు. అనంతరం రోగులకు పండ్లు పంపి ణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్, ఏఎంసీ వైస్ చైర్మన్ గంగాధర్, దవాఖాన సూపరింటెండెంట్ వంశీమాధవ్, నాయకులు రాము నాయక్, రాజగంగన్న, సురే శ్, కొక్కుల ప్రదీప్, వెల్ముల శోభన్, మహిపాల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.