భీమారం, మార్చి 13 : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం వ్యాఖ్యలు మనస్తాపానికి గురి చేశాయని తపస్ మండల అధ్యక్షుడు గొర్రె సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి భీమానాథ మహేశ్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ బుధవారం హైదరాబాద్లో జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో పెండింగ్ డీఏలతో పాటు పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ఉద్యోగులు కోరగా, అసలు ఆదాయమే లేదు.
.మీరేమో డీఏలు అడుగుతున్నారని సీఎం అనడం ఉద్యోగ.. ఉపాధ్యాయ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రాష్ట్రంలో నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, మరో డీఏ ప్రకటించాల్సి ఉందని, పీఆర్సీ కోసం ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదురు చూపులతో కాలం వెళ్లదీయాల్సి వస్తున్నదన్నారు. డీఏలు, పీఆర్సీలు అడిగితే జీతాలే సమయానికి ఇవ్వడం లేదనడం శోచనీయమన్నారు. దుర్గం చందు, ఏలే విజయ్ కుమార్, సునీల్ కుమార్ పాల్గొన్నారు.