best secretary | తాండూర్, ఆగస్టు 11: జోనల్ స్థాయి ఉత్తమ క్లబ్ గా అండూర్ వాసవి క్లబ్ ఎంపికై ఆవార్డు గెలుచుకున్నది. ఆదివారం రాత్రి మంచిర్యాల కేంద్రంలోని విశ్వనాథ ఆలయం కాలక్షేప మండపంలో వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఆదేశానుసారం జోన్ సోషల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆసిఫాబాద్, తాండూర్, బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్ క్లబ్ లలో ఉత్తమ క్లబ్ గా తాండూర్ క్లబ్ ఎంపికై ఆవార్డును గెలుచుకున్నది. ఉత్తమ కార్యదర్శిగా తాండూర్ వనిత సింధూర్ క్లబ్ కార్యదర్శి కోడిప్యాక మాదురి ఎన్నికై ఆవార్డును అందుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంతర్జాతీయ అధికారి వాసవియన్ కలికోట శ్రీనివాస్ ఆబ్జర్వర్ గా కొంకుముట్టి వెంకటేశ్వర్లు గౌరవ అతిధిగా జిల్లా వైస్ గవర్నర్ పుల్లూరి బాల్మోహన్ కార్పొరేట్ వైస్ చైర్మన్ కే సంతోష్ కుమార్ కార్యక్రమ నిర్వాహకురాలు జోన్ చైర్మన్ మేడి లావణ్య రాము తాండూర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు మధుసూదన్, కార్యదర్శి మని కృష్ణ, కోశాధికారి మహేష్, బాపూజీ, చంద్రశేఖర్, గణేష్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.