నిర్మల్ అర్బన్, జూలై 3 : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్ నుంచి విద్యార్థి సంఘ నాయకులు, కళాశాల, పాఠశాల విద్యార్థులతో భారీ ర్యాలీ తీశారు.
ఈ ర్యాలీ ఆర్డీవో కార్యాలయం నుంచి శివాజీ చౌక్ వరకు కొనసాగింది. శివాజీ చౌక్ వద్ద జాతీయ రహదారిపై విద్యార్థులు నోట్ బుక్స్‌ను చదువుకుంటూ ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శివకుమార్ మాట్లాడుతూ.. ఏండ్ల తరబడి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్‌లో ఉండడంతో విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మండిపడ్డారు. దీంతో ఉన్నత చదువులకు దూరం అవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, దినేశ్, సన్ని, లక్ష్మణ్, సాయి సిద్దూ, విఘ్నేశ్, రాజేందర్ పాల్గొన్నారు.