ఖానాపూర్: విద్యార్థులు ర్యాగింగ్‌కు ( Ragging ) పాల్పడి కేసులు నమోదైతే మంచి భవిష్యత్తును కోల్పోతారని ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్(Rahul Gaikwad) అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాంటీ ర్యాగింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలని, ర్యాగింగ్ వల్ల అమాయక విద్యార్థులు మానసిక శోభకు గురై ఆత్మహత్య పాల్పడితే కేసుల్లో ఇరుక్కుని తమ ఉజ్వల భవిష్యత్తు నాశనం అవుతుందని వివరించారు. ఈ సందర్భంగా చట్టరిత్యా విధించే శిక్షలపై అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ శ్రీదేవి, ఎన్ఎస్ఎస్ అధికారి క్యాతం సంతోష్ రెడ్డి, ఆధ్యాపకులు సరిత, హమీద్, మోహన్, రవీందర్, రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.