ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 29 : గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న బూత్ కమిటీలతో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవుతుందని ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్ అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఆదేశాల మేరకు గురువారం మండలంలోని దంతన్‌పెల్లి, దొంగచింత గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ దంతన్‌పల్లి గ్రామంలో 30 మంది, దొంగచింతలో 10 మంది బూత్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నామని తెలిపారు. అనంతరం సభ్యులకు నిర్వహించాల్సిన బాధ్యతల గురించి వివరించామన్నారు.
పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో దంతన్‌పల్లి సర్పంచ్ ముచ్చినేని భూమన్న, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసండ్ల ప్రభాకర్, ఎంపీటీసీ ఆత్రం లచ్చు, దంతన్‌పల్లి గ్రామాధ్యక్షుడు సులేమన్యాఫై, దొంగచింత పటేల్, కుమ్ర జుగాదిరావు, ముకుంద్, మాధవ్, మునీర్, జాకు పటేల్, ఇబ్రహీం, సలీం, మోహిన్, సందీప్‌రెడ్డి, సత్యం, లచ్చన్న, విజయ్‌రెడ్డి, యేసు, ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 29 : మండలంలోని మారుతిగూడ, చాందూరి, ఎక్స్‌రోడ్డు లింగోజితండా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీలను ఎన్నుకున్నామని వైస్ ఎంపీపీ దావులే బాలాజీ అన్నారు. సభ్యులకు నిర్వహించాల్సిన బాధ్యతల గురించి వివరించామని తెలిపారు. కార్యక్రమంలో మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు రషీద్, సర్పంచ్‌లు ప్రకాశ్, రాజేశ్వర్, మానిక్రావ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.