జైపూర్, ఆగస్టు 27 : పెగడపల్లిలోని ఎస్టీపీపీ దేశంలోనే అత్యుత్తమమైనదని మినిస్త్రీ ఆఫ్ కోల్ సెక్రటరీ దర్శన్కుమార్ కొనియాడారు. మంగళవారం స్థానిక విద్యుత్కేంద్రాన్ని ఆయయన సందర్శించారు. ఈడీ రాజశేఖర్, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మొక్కను జ్ఞాపికగా అందించి శాలువాతో స త్కరించారు. మొదట యూనిట్లను పరిశీలించగా ఉత్పత్తికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యుత్ ఉత్పత్తిలో కర్బణ ఉదారాలను తగ్గించడం కోసం (ఎఫ్జీడీ) ఫ్లూ గ్యాస్ డీసల్పరైజేషన్ను నిర్మిస్తున్నట్లు సెక్రటరీకి అధికారులు వివరించారు. విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్లతో పాటు, సోలార్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శిం చి సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజులో ఎస్టీపీపీని అన్ని రంగాల్లో ముందుంచాలని అధికారులకు సూచించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీఎం పీసీఎస్ శ్రీనివాసులు, చీఫ్ఆఫ్వోఅండ్ఎం జైన్సింగ్, ఏజీఎం ఎఫ్జీడీ ఎంవీ రమణ, మేనేజర్ చంద్రమణి, ఎస్వోటూ ఈడీ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.