కోటపల్లి, ఫిబ్రవరి 19 : 108లో అత్యాధునిక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్యాలయ క్వాలిటీ డిపార్ట్మెంట్ అధికారి కిశోర్ అన్నారు. కోటపల్లి మండల కేంద్రంలోని 108 వాహనాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 108 అంబులెన్స్ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో అలసత్వం వద్దని సూచించారు. రికార్డులు, అందుబాటులో ఉన్న మందులను పరిశీలించారు. స్థానికులను అంబులెన్స్ సేవల గురించి అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంబులెన్స్ వాహనాల ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ ఉన్నారు.