కాసిపేట, ఆగస్టు 3 : చదువుతోనే గౌరవం, విజ్ఞానం పెరుగుతుందని రాష్ట్ర వయోజన విద్య డైరెక్టర్ డాక్టర్ జీ.ఉషారాణి స్పష్టం చేశారు. ఆదివారం కాసిపేట మండలంలో నిర్వహిస్తున్న 100 రోజుల్లో వంద శాతం అక్షరాస్యత కార్యక్రమ నిర్వహణను ముత్యంపల్లి రైతు వేదికలో పర్యవేక్షించారు. ఈ మేరకు వయోజన విద్యలో విద్యాభ్యాసం చేసిన వయోజనులతో రాయించి ప్రతిభను పరిశీలించారు.
అక్షరాలు బాగా రాసి చదివిన వారిని ప్రశంసించి ఆమె స్వయంగా ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున నగదు బహుమతులు అందించారు. ఉల్లాస్ కార్యక్రమంలో అక్షరాస్యతా విధానంపై వివరించారు. మోసపోకుండా ఉండేందుకు చదువు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. చదువు మధ్యలో ఆపేసిన వారు ఓపెన్ స్కూల్ ద్వారా ఓపెన్ ఇంటర్, టెన్త్‌తో తమ విద్యను కొనసాగించాలని సూచించారు.
వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు కృషి చేసిన వయోజన విద్య అధికారులను, ఐకేపీ సిబ్బందిని అభినందించారు. అనంతరం మొదటిసారి మండలంలో పర్యటించిన స్టేట్ డైరెక్టర్ ఉషారాణిని వయోజన విద్య అధికారులు, వయోజనులు, సెర్ఫ్ సిబ్బంది, అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి, మండల స్పెషల్ ఆఫీసర్ పురుషోత్తం నాయక్, సెక్టోరల్ ఆఫీసర్ సత్యనారాయణ మూర్తి, ఐకేపీ ఏపీఎం రాజ్‌కుమార్, డీఆర్పీలు సుమన్, తిరుపతి, బండ శాంకరి, అసిస్టెంట్ ప్రొవిజన్ ఆఫీసర్ శ్రీనివాస్, ఐకేపీ సీసీలు రాజమల్లు, అశోక్, లక్ష్మీ, శారద, వసంత, సిబ్బంది, వయోజన విద్య ఇన్స్ట్రక్టర్స్ పాల్గొన్నారు.
మంచిర్యాల టౌన్, ఆగస్టు 3 : నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమం ‘ఉల్లాస్’ అని వయోజన విద్యాశాఖ డైరెక్టర్ ఉషారాణి పేర్కొన్నారు. నస్పూర్‌లోని సమీకృత కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా వ యోజన విద్యా కార్యాలయాన్ని ఆదివారం సందర్శించారు. ఆమె వెంటన అధికారులు పాల్గొన్నారు.