శ్రీరాంపూర్, జనవరి 3: మహిళా లోకానికి ఆదర్శం సావిత్రీబాయి ఫూలే అని శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి పేర్కొన్నారు. శ్రీరాంపూర్ గనులు, డిపార్ట్మెంట్లపై బుధవారం సావిత్రీఫూలే 193వ జయంతి నిర్వహించారు. జీఎం ఆఫీస్లో సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి సేవా ఆధ్యక్షురాలు రాధాకుమారి, జీఎం పూలమాల వేసి నివాళులర్పించా రు.
మహిళలకు వ్యాసరచన పోటీలు ని ర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఎస్వోటూ జీఎం రఘుకుమార్, డీవైజీఎం అరవిందరావు, ఏజీఎం మురళీధర్, డీవైజీఎం చిరంజీవులు, ఎస్సీ లైజన్ ఆఫీసర్ కిరణ్కుమార్, సర్వే ఆఫీసర్ వెంకటేశం, లా మేనేజర్ శిరీషారెడ్డి, లా ఆఫీసర్ ప్రభందిత, డీవైపీఎం రాజేశ్, సీనియర్ పీవో కాంతారావు పాల్గొన్నారు.