నార్నూర్, జూన్ 2 : కేసీఆర్ హయంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి వెళ్లివిరిసిందని ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహనీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జాతీయ జెండాను ఎగిరేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఎనలేని అభివృద్ధి జరిగిందన్నారు.
రాబోవు రోజులలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కనక సత్యనారాయణ, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ మాజీ చైర్మన్ తోడసం నాగోరావు, మాజీ మండల అధ్యక్షుడు ఉర్వేత రూప్ దేవ్, నాయకులు సయ్యద్ ఖాసిం, ఫిరోజ్ ఖాన్, శివాజీ, సుల్తాన్ ఖాన్, సుభాష్, యశ్వంత్ తదితరులు ఉన్నారు.