శ్రీరాంపూర్, ఫిబ్రవరి 19 : శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో ఏరియా జీఎంగా శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. జీఎం శ్రీనివాస్‌కు ఇన్చార్జి జీఎం శ్రీనివాస్, ఎస్వోటూ జీఎం సత్యనారాయణ, డీఐవైజీఎం అరవిందరావు స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు.
జీఎం శ్రీనివాస్ బెల్లంపల్లి ఏరియా నుంచి బదిలీపై శ్రీరాంపూర్‌కు వచ్చారు. పీవో ఏవీ రెడ్డి, ఫైనానాన్స్ ఏజీఎం మురళీధర్, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, డీవైజీఎం చిరంజీవులు, ఆనంద్‌కుమార్, చంద్రలింగం, డీవైసీఎంవో డాక్టర్ రమేశ్‌బాబు, సెక్యూరిటీ ఆఫీసర్ జక్కారెడ్డి, ఎస్ఈ కిరణ్‌కుమార్, ఏజెంట్లు శ్రీధర్, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ ఏరియా జీఎంగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్‌ను బుధవారం టీబీజీకేఎస్ నా యకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు. టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి సురేందరెడ్డి, ఏరియా ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేశ్, ఆర్గనైజర్ అన్వేష్‌రెడ్డి జీఎం శ్రీనివాస్‌ను కలిసి సత్కరించారు.
అనంతరం శ్రీరాంపూర్ ఏరియా సమస్యలను జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండీ లాలా, సుధాకర్, సాధుల భాస్కర్, ఉత్తేజ్‌రెడ్డి, జగదీష్, వెంకట్‌రెడ్డి, రాజునాయక్, గోపాల్, జైపాల్‌రెడ్డి, సతీశ్ యాదవ్, బుద్ది ప్రసాద్ పాల్గొన్నారు.