దస్తురాబాద్,జనవరి1: మండలంలోని బుట్టాపూర్ ప్రాథమికొన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా విద్యార్థులను తీర్చిది ద్దుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యార్థులంద రూ ఆంగ్లంలో మాట్లాడేలా స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను ప్రధాన ఉపాధ్యాయుడు బ్రహ్మచారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
పాఠశాలలో మొత్తం 140 మంది విద్యార్థులు చదవుకుంటున్నారు. 3 నుంచి 7 తరగతి వరకు దాదాపు 110 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి గత ఏడాది అక్టోబర్‌లో విద్యార్థులకు ప్రత్యేక విద్యా బోధనను ప్రారంభించారు. దాదాపు 45 రోజుల నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తు న్నారు. మరో 35 రోజులు ఈ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని హెచ్ఎం తెలిపారు. ఈ గ్రామం నుంచి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తున్న దాదాపు 12 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారు.
కార్పోరేట్‌కు దీటుగా..
కార్పోరేట్ స్థాయికి దీటుగా ప్రభుత్వ పాఠశాల లో ప్రతి రోజు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నారు. రోజూ సాయంత్రం ప్రాక్టీస్ చేయిస్తూ విద్యార్థులు ఇంగ్లిష్‌లో మాట్లాడేలా తర్ఫీదు ఇస్తున్నారు. పాఠశాలలో స్కూల్ బులెటిన్ బోర్డు ఏర్పాటు చేశారు. వాటిలో జనరల్ నాలెడ్జ్, సూక్తులు, త్రిభాష పదాలు,పద విస్తరణ, తెలుగు కోసం వేమన, సుమతి,శతకాల్లోని నీతి పద్యాలను బోర్డుపై రాస్తూ పిల్లలతో ప్రాక్టీస్ చేయిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇంగ్లిష్ చక్క గా మాట్లాడుతున్నారు. విద్యార్థులకు సాయంకాలం సమయంలో మానసిక స్థిరత్వం, ఏకాగ్రత పెంపొందించేందుకు ధ్యానం,యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. చెన్నూర్ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ యెన్నమనేని ప్రవీణ్ రావు-సంగీత దంపతుల సహకారంతో విద్యార్థులకు నిత్యం పండ్లు పంపిణీ చేస్తున్నారు.
సులభంగా నేర్చుకుంటున్నాం
పాఠశాలలో మాకు ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. స్పెషల్ క్లాస్‌లో చెప్పివని నిత్యం మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్నాం. మా తోటి మిత్రులతోని ఇంగ్లిష్‌లోనే మాట్లాడుకుంటున్నం. ఇంగ్లిష్తో పాటు జనరల్ నాలెడ్జ్,త్రి భాష పదాలు, పద విస్తరణ, తెలుగు పద్యాలను మాతో కంఠస్తం చేయిస్తున్నారు. ఉపాధ్యాయుల ప్రత్యేక ప్రణాళితో మేం సులభంగా ఇంగ్లిష్ నేర్చుకుంటున్నాం.
నందిని,విద్యార్థి,5వ తరగతి
అందరూ సహకరిస్తున్నారు
పాఠశాల అభివృధ్ధికి సర్పంచ్,ఎస్ఎంసీ సభ్యులు, గ్రామపెద్దలు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సహకారం అందిస్తున్నారు. కార్పోరేట్ స్థాయిలో విద్యార్థులు ఇంగ్లిష్‌లో పట్టు సాధించేలా ఆలోచనలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తు న్నాం. స్పోకెన్ ఇంగ్లీష్‌తో పాటు జనరల్ నాలెడ్జ్, భాష పదాలు,పద విస్తరణ,తెలుగు కోసం వేమన,సుమతి,శతకాలలోని నీతి పద్యాలను విద్యార్థులకు నేర్పిస్తున్నాం.
బ్రహ్మచారి, హెచ్ఎం, బుట్టాపూర్ పాథమికోన్నత పాఠశాల