కోటపల్లి : ప్రభుత్వ వసతి గృహాల ( Hostel ) సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు కోటపల్లి తహసీల్దార్( Tahasildar ) రాఘవేంద్రరావు, ఎంపీడీవో లక్ష్మయ్య (MPDO) , ఎస్సై రాజేందర్ అన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలకేంద్రంలోని ఎస్సీ హాస్టల్, కేజీబీవీ ( KGBV ), ఆశ్రమ పాఠశాలను సందర్శించిన వారు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
ఎస్సీ హాస్టల్లో సమస్యలను కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకువెళ్లి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. 10వ తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. బాలికలు ఉన్న వసతి గృహాల్లో మహిళ కానిస్టేబుళ్లను ( Womens Constables ) ఇన్చార్జిగా నియమించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సందీప్ పాల్గొన్నారు.