సర్వైకల్ క్యాన్సర్ నివారణే లక్ష్యం
మహిళ ల్లో ప్రధానంగా వచ్చే సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్) నివారణే లక్ష్యంగా హెచ్‌పీవీ టీకాను అందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ టీ కాను గతనెల 28న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
- ఈ నెల 8 నుంచి హెచ్‌పీవీ టీకాలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి
- నిర్మల్ జిల్లాలో 7,541 మంది బాలికల గుర్తింపు
- నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్
నిర్మల్, మార్చి 6(నమస్తే తెలంగాణ): మహిళ ల్లో ప్రధానంగా వచ్చే సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్) నివారణే లక్ష్యంగా హెచ్‌పీవీ టీకాను అందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ టీ కాను గతనెల 28న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీకాలు వేసే కార్యక్రమాన్ని జిల్లా ల్లో ప్రారంభించనున్నారు. నిర్మల్ జిల్లాలో నిర్మల్ ప్రభుత్వ ప్రధాన దవాఖానతో పాటు భైంసాలోని ఏరియా దవాఖాన, ఖానాపూర్, ముథోల్, నర్సాపూర్(జీ)లో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, నిర్మల్ పట్టణంలోని మెటర్నిటీ చైల్డ్‌కేర్ హాస్పిటళ్లలో 14 సంవత్సరాలు నిండి 15 ఏళ్ల వయస్సు లోపు బాలికలకు ఇవ్వనున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల పరిధిలో మొత్తం 7,541మంది బాలికలు ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ ఈ నెల 8 నుంచి హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లో మా వైరస్) టీకాలు ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు మెడికల్ ఆఫీసర్లతో పాటు సూపర్వైజర్లకు, ఇతర పారామెడికల్ సిబ్బందికి ఇప్పటికే ఈ టీకా పంపిణీపై శిక్షణ సైతం పూర్తి చేశారు. గతంలో ఈ టీకా ప్రధాన నగరాల్లోని కార్పొరేట్ దవాఖానల్లో మాత్రమే అందుబాటులో ఉండగా, ప్ర స్తుతం పేద, మధ్య తరగతి వర్గాలకు సైతం అందుబాటులోకి రావడం శుభ పరిణామమంటున్నారు.
హెచ్‌పీవీ టీకాతో 95శాతం రక్షణ…
ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో 4శాతం వరకు ఈ సర్వైకల్ క్యాన్సర్లే ఉం టున్నాయని సర్వేలు చెబుతున్నాయి. హెచ్‌పీవీ వైరస్‌తో దీర్ఘకాలికంగా ఇన్ఫెక్షన్లు కలిగిం చి క్యాన్సర్‌కు దారితీస్తుందని, చిన్నా పెద్ద తేడా లేకుండా వస్తుందని తెలిపారు. ముఖ్యం గా చిన్న వయసులో వివాహం జరిగి, వ్యక్తిగత శుభ్రత లోపిస్తే ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా 95శాతం వరకు రక్షణ ఇస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. ఈ టీకా ను గర్భిణులు, అలర్జీ ఉన్నవారు, ఇప్పటికే హెచ్‌పీవీ టీకా తీసుకున్నవారు తిరిగి తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్ర స్తుతం ఈ టీకాను నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ కింద జిల్లాలోని 6 ప్రధాన దవాఖానలో అమలు చేస్తారు. ఆ తర్వాత మరో 60 రోజుల పాటు ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల్లో సైతం ఈ టీకాను అందుబాటులో ఉం చుతారు. మూడు నెలల ప్రత్యేక కార్యక్రమం అనంతరం సాధారణ టీకా కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే 14-15 ఏళ్ల లోపు వయస్సు గల బాలికలకు ఈ హెచ్‌పీవీ టీకాను వేస్తారు.
ఉమెన్స్ డే రోజు ప్రారంభిస్తాం
ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ప్రధాన దవాఖానల్లో హెచ్‌పీవీ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాం. శిక్షణ పొందిన స్పెషలిస్టు వైద్యుల పర్యవేక్షణలో బాలికలకు ఈ టీకాలను వేస్తారు. 14-15 సంవత్సరాల వయస్సు గల బాలికలు ఈ టీకా తీసుకోవడానికి అర్హులు. ఈ టీకా తీసుకునే బాలికలకు వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. హెచ్‌పీవీ టీకా తీసుకుంటే భవిష్యత్‌లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
– రాజేందర్, నిర్మల్ డీఎంహెచ్‌వో
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

