ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జూలై 13 : విధుల నిర్వహణలో ఏఆర్ పోలీసుల సేవలు భేష్ అని ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్‌తో దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఏఆర్ పోలీసులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో శాంతి భ ద్రతల పరిరక్షణలో సివిల్, ట్రాఫిక్, క్రైం వంటి ప్రధాన విభాగాలతో పాటు ఏఆర్ విభాగం కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నదని అభినందించారు.
ఎన్నికలు, పండుగలు, ఊరేగింపులు, ఘర్షణ వాతావరణంలో బందోబస్తు నిర్వహించడంపై ప్రశంసించారు. ఏఆర్ సిబ్బంది సంక్షేమానికి వైద్య శిబిరాలు, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ సీఐ రాణా ప్రతాప్, ఆర్ఐ అడ్మిన్ పెద్దన్న, ఆర్ఐఎంటీవో అంజన్న, ఆర్ఐ హోంగార్డ్ ఇన్చార్జి భరత్ భూషణ్, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు విజయ శంకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.