ఖానాపూర్, మే 21 : కొత్తగా ఏర్పాటైన ఖానాపూర్ మున్సిపాలిటీలో పాలకవర్గ సభ్యలు, స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పట్టణంలోని రోడ్లపై కొనసాగుతున్న అక్రమణలపై అసంతృప్తి వ్యక్తం చేస్తు ఆరో వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ ఆఫ్రినబేగం తన పదవికి రాజీనామా చేశారు. మున్సిపాలిటీలో అభివృద్ధే ధ్యేయంగా పనులు చేపడుతుంటే చైర్మన్ సత్యం, కమిషనర్ మనోహర్ అడ్డుకుంటున్నారని వాపోయారు. ఆరో వార్డు పరిధిలోని లింగాపూర్ అడ్డా, పాత బస్టాండు, అంగాడి బజార్ ప్రాంతంలో అక్రమంగా వెలిసిన కట్టడాలను తొలిగించాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో తాను కౌన్సిలర్ పదవిలో ఉండి వార్డు అభివృద్ధి, ప్రజలకు మేలు చేయడం లేకపోతున్నని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భర్త అమానుల్లాఖాన్, కమిషనర్ మనోహర్ పాల్గొన్నారు.