సింగరేణి ప్రైవేటీకరణపై భగ్గుమన్న బొగ్గుబాయి
నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్ ఆందోళన
గనులు, ఓపెన్‌కాస్టులు, డిపార్ట్మెంట్లపై గర్జించిన కార్మికలోకం
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలతో శవయాత్ర.. మోదీ దిష్టిబొమ్మలు దహనం
సింగరేణికి సీఎం కేసీఆరే శ్రీరామరక్ష : గుర్తింపు సంఘం నాయకులు
ఆదిలాబాద్, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి);కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బుధవారం ఆందోళనలు వెల్లువెత్తాయి. తాజాగా ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం, వేతన జీవుల ఆదాయపన్ను పరిమితి పెంచకపోవడం, బొగ్గు బ్లాకుల వేలం, సింగరేణి ప్రైవేటీకరణపై నిరసనలు హోరెత్తాయి. పల్లెలు, పట్టణాల్లో టీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యోగులు, ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. గనులు, ఓపెన్‌కాస్టులు, డిపార్ట్మెంట్లపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు కేంద్ర ప్రభుత్వ, మోదీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. మోదీ డౌన్ డౌన్.. కేంద్రం తీరు మార్చుకోకపోతే నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
స్వరాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభు త్వం వేతనాలు పెం చుతూ వస్తున్నది. రాష్ట్రంలో కొత్త పీఆర్సీ 2018 జూలై ఒకటి నుంచి అమల్లోకి తెచ్చిన 2020 ఏప్రిల్ ఒకటి నుంచి నగదు చెల్లింపులు చేస్తున్నది. కొత్త పీఆర్సీ ప్రకారం చూస్తే.. 30 శాతం ఫిట్మెంట్తో కూడిన వేతన స్థిరీకరణ చేయడంతోపాటు ఇటీవల మూడుసార్లు కలిపి దాదాపు 10 శాతం డీఏ పెంచారు. దీంతోపాటు మూల వేతనంపై పెరిగిన హెచ్ఆర్ఏ లాంటి ఇతర వాటిని పరిగణనలోకి తీసుకొని చూస్తే.. దాదాపు 50 శాతం వేతనాలు పెరిగాయి. ఈ విషయాన్ని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఇప్పటికే సగర్వం గా ప్రకటించాయి. నిజానికి ఉత్తర భారతంతో పోలిస్తే.. మన ఉద్యోగులకు వేతనాలు ఎక్కువగానే ఉన్నాయి. అయి తే పెరుగుతున్న పెట్రోలు, డీజిల్, నిత్యావసరాల ధరలు, ఉద్యోగుల కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచింది. దీంతో అటెండర్ నుంచి మొదలు ప్రతి ఉద్యోగీ ఐటీ పరిధిలోకి వచ్చారు.
టాక్స్ రూపేణా కోట్లు మింగుతున్న కేంద్రం..
ఉద్యోగ, ఉపాధ్యాయ, ఎలక్ట్రిసిటీ వంటి విభాగాలే కాదు.. అన్ని విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఉమ్మడి జిల్లాలో 22వేల పైచిలుకు ఉన్నది. ప్రతి ఉద్యోగీ ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చారు. వీరితోపాటు పెన్షనర్లు 15 వేల మంది ఉన్నారు. ఒక్కో ఉద్యోగి సుమారు 50 వేల నుంచి 3లక్షల వరకు టాక్స్‌లు కడుతున్నారు. ఉద్యోగుల గణాంకాల ప్రకారం చూస్తే కోట్లలో ఆదాయ పన్ను కేంద్రానికి చెల్లిస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా టాక్స్ కటింగ్‌పై మళ్లీ 4 శాతం సర్‌చార్జీని విధించి కేంద్రం వసూలు చేస్తున్నది. ఇదో అదనపు భారం. కొంత మంది పెన్షనర్లు కూడా పన్ను కోవలోకి వస్తున్నారు.
ఎనిమిదేళ్లుగా ఎదురుచూపులే..
పెరుగుతున్న ఖర్చులు, అవసరాల మేరకు వేతనాలు పెరిగినా.. అందుకనుగుణంగా మాత్రం ఆదాయపన్ను పరిమితి పెంచడంలో కేంద్రం ఎమిదేళ్లుగా వివక్ష చూపుతూ వస్తున్నది. గతంలో ఒక్క స్లాబ్ ఉంటే.. కొత్తగా మరో స్లాబ్ ను అందుబాటులోకి తెచ్చి రెండు రకాల స్లాబ్‌లను అమలు చేస్తుందే తప్ప ఆదాయ పన్ను, స్టాండెడ్ డిడెక్షన్, పొదుపు మినహాయింపుల పరిమితులు మాత్రం పెంచడం లేదు. మొదటి స్లాబ్ ప్రకారం చూస్తే.. 2.50 లక్షల నుంచి 5 లక్షల వరకు 5 శాతం, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20 శాతం, 10 లక్షలపైగా ఆదాయముంటే 30 శాతం టాక్స్ చెల్లించాలి. బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రెండో స్లాబ్ ప్రకారం చూస్తే.. 2.50 లక్షల నుంచి 5 లక్షల వరకు 5 శాతం, 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు 10శాతం, 7.5 లక్షల నుంచి 10 లక్షల వరకు 15 శాతం, 15లక్షల నుంచి 12.50 లక్షల వరకు 20శాతం, 15 లక్షలకు పైబడి ఆదాయముంటే 30శాతం టాక్స్ చెల్లించాలనే స్లాబ్‌ను అమలు చేస్తున్నది. బీజేపీ అమల్లోకి తెచ్చిన రెండో స్లాబ్‌ను ఉద్యోగులు పక్కన పెట్టా రు.
ఈ స్లాబ్‌ను ఎంచుకుంటే.. పొదుపు పరిమితి అంటే లక్షా 50 వేల మినహాయింపులు వర్తించవు. అందుకే ఉద్యోగులంతా మొదటి స్లాబ్‌నే ఆధారంగా చేసుకొని పన్ను చెల్లిస్తున్నారు. ఈ స్లాబ్‌లను మార్చాలని, ముఖ్యంగా ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షలకు పెంచాలని, ప్రస్తుతమున్న పొదుపు పరిధి 1.50 లక్షల నుంచి 3 లక్షలకు పెంచాలని చాలా ఏండ్లుగా కోరుతున్నారు. కానీ, కేంద్రం మాత్రం ప్రతి బడ్జెట్లో వేతన జీవుల ఆశలపై నీళ్లు చల్లుతూనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు వేతనాలు పెంచుతుంటే.. కేంద్రం మాత్రం ఆదాయ పన్ను రూపేణా అంతా మింగుతోందన్న అసంతృప్తి ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నది. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీ పరిమితిని 5లక్షలకు పెంచాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశా రు. తాము అధికారంలోకి వస్తే చేసి తీరుతామని చెప్పారు. కానీ, ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.